Jammu High Speed Internet: జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

|

Jan 23, 2021 | 5:37 PM

Jammu Speed Internet: జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగించింది. గుండెర్బల్‌, ఉదంపూర్‌ మినహా మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ...

Jammu High Speed Internet: జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Follow us on

Jammu  High Speed Internet: జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగించింది. గుండెర్బల్‌, ఉదంపూర్‌ మినహా మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ నిషేధం పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ మీదుగా ఉగ్రవాదులు చొరబడేందుకు సిద్దంగా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతోనే ఈ నిషేధం పొడిగించినట్లు తెలిపింది.

కాగా, గండర్‌బల్‌, ఉదంపూర్‌ జిల్లాలో హైస్పీడ్‌ మొబైల్‌ డేటా సేవలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇతర జిల్లాలో ఇంటర్నెట్‌ వేగం 2జీకి మాత్రమే పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ పరిమితులు జమ్ముకశ్మీర్‌లోని పని చేస్తున్న రాడికల్‌, ఉగ్రవాద సంస్థల చర్యలను అడ్డుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో చొరబాట్లను సమన్వయం చేయడానికి ఈ నిషేధం ఉపయోగపడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గత ఆగస్టులో జమ్మూలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

Also Read: Pakistan Tunnel: జమ్మూలో మరో అతి పెద్ద పాక్ సొరంగం గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. పది రోజుల్లో ఇది రెండోది