ఎలక్ట్రిక్‌ సైకిల్‌ వీడియో విడుదల చేసిన హార్లే-డేవిడ్సన్‌

| Edited By:

Oct 28, 2020 | 4:40 PM

అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాల నుంచి నిష్క్రమించాలనుకున్న హార్లే-డేవిడ్స్‌న్‌ యూటర్న్ తీసుకుంది.

ఎలక్ట్రిక్‌ సైకిల్‌ వీడియో విడుదల చేసిన హార్లే-డేవిడ్సన్‌
Follow us on

Harley-Davidson Electric Bicycle: అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాల నుంచి నిష్క్రమించాలనుకున్న హార్లే-డేవిడ్స్‌న్‌ యూటర్న్ తీసుకుంది. దేశీయ సంస్థ హీరో మోటోకార్ప్‌తో కలిసి తమ వ్యాపారాన్ని కొనసాగించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కంపెనీ ఈ-సైకిల్‌ మార్కెట్‌లోకి దిగింది. సీరియల్‌ 1 సైకిల్‌ కంపెనీ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ సైకిల్‌ని హార్లే డేవిడ్‌సన్‌ విడుదల చేసింది. ఈ సైకిల్‌కి సంబంధించిన ఎలాంటి వివరాలను ఇంకా సంస్థ వెల్లడించలేదు. కానీ సైకిల్‌కి సంబంధించి వివిధ కోణాల్లో ఫొటోలను విడుదల చేసింది. కాగా 1903లో హార్లే డేవిడ్‌సన్‌ రూపొందిన మోటార్‌ సైకిల్‌కి సీరియల్‌ నంబర్ వన్‌ అనే మరో పేరు ఉండగా.. ఇప్పుడు అదే పేరుతో సైకిల్‌ కంపెనీని ప్రారంభించింది. ఇక ఈ సైకిళ్లు వచ్చే ఏడాది వేసవిలో మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం.

Read More:

స్టాఫ్‌కి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన జాక్వలిన్‌

ప్రారంభమైన నాగశౌర్య-అనీష్ కృష్ణ మూవీ