గార్బా డ్యాన్స్‌లో బుసలు కొట్టే నాగులు.. చివరకు..!

| Edited By:

Oct 13, 2019 | 6:09 PM

గార్బా.. ఇది గుజరాత్ సంప్రదాయ నృత్యం.. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ వేడుకల్లో అందర్నీ ఆకట్టుకునేందుకు కొందరు చేసిన నృత్యం వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. చివరకు పోలీస్ స్టేషన్‌, అరెస్ట్‌ల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలోని షిల్‌ గ్రామంలో..నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గార్భా నృత్య ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లోనే ఓ వైపు గార్బా నృత్య ప్రదర్శన చేస్తుంటే.. అదే వేదికపై ఇద్దరు […]

గార్బా డ్యాన్స్‌లో బుసలు కొట్టే నాగులు.. చివరకు..!
Follow us on

గార్బా.. ఇది గుజరాత్ సంప్రదాయ నృత్యం.. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ వేడుకల్లో అందర్నీ ఆకట్టుకునేందుకు కొందరు చేసిన నృత్యం వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. చివరకు పోలీస్ స్టేషన్‌, అరెస్ట్‌ల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలోని షిల్‌ గ్రామంలో..నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గార్భా నృత్య ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లోనే ఓ వైపు గార్బా నృత్య ప్రదర్శన చేస్తుంటే.. అదే వేదికపై ఇద్దరు మహిళలతో పాటు.. మరో బాలిక కోబ్రాలతో కనిపించారు. ఓ చేతిలో పాము.. మరో చేతిలో కత్తి పట్టుకుని.. పామును ఆడిస్తున్నట్లు వీడియోలో ఉంది. విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా… పాములను సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో అరెస్టైన నిందితులకు స్థానిక కోర్టు వెంటనే బెయిలు ఇవ్వడం గమనార్హం.