గుడ్ న్యూస్.. ఇక దేశమంతా ఒకేరోజు వేతనాలు..!

| Edited By: Pardhasaradhi Peri

Nov 16, 2019 | 6:49 AM

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు జమిలి ఎన్నికల కోసం కసరత్తులు చేస్తూనే ఉండగా.. అదే బాటలో మరిన్ని ప్రయత్నాలు చేపడుతోంది. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఒకే రోజు వేతనాలు అందించేందుకు (వన్ నేషన్- […]

గుడ్ న్యూస్.. ఇక దేశమంతా ఒకేరోజు వేతనాలు..!
Follow us on

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు జమిలి ఎన్నికల కోసం కసరత్తులు చేస్తూనే ఉండగా.. అదే బాటలో మరిన్ని ప్రయత్నాలు చేపడుతోంది. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా ఒకే రోజు వేతనాలు అందించేందుకు (వన్ నేషన్- వన్ పే డే) నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. త్వరలోనే ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి తెలిపారు. ఇది అమలు చేస్తే దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు, కార్మికులకు ఒక్క రోజే వేతనాలు అందుతాయన్నారు. “వన్ నేషన్- వన్ పే డే” అనే చట్టం త్వరలోనే రాబోతుందని.. ప్రధాని మోదీ ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్మిక సంస్కరణల్లో ఇదొక భాగమన్నారు.

అంతేకాదు.. కార్మికులందరికీ మెరుగైన జీవితం గడిపేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస జీతం ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. సెంట్రల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సదస్సులో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మంత్రి వెల్లడించిన ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. శ్రామిక వర్గానికి ఖచ్చితంగా శుభవార్తే. అయితే ఇది అమల్లోకి వస్తుందన్న దానిపై మంత్రి ఓ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.