PMGKP Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హెల్త్ వర్కర్లకు కరోనా బీమా పథకం పొడిగింపు..

| Edited By: Phani CH

Oct 21, 2021 | 6:23 AM

PMGKP Scheme: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతూ..

PMGKP Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హెల్త్ వర్కర్లకు కరోనా బీమా పథకం పొడిగింపు..
Pmgkp
Follow us on

PMGKP Scheme: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతూ, రోగులకు సేవలందిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) క్రింద బీమా పథకాన్ని పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి గత ఉత్తర్వుల ప్రకారం.. ఈ పథకం గడువు 2021 అక్టోబరు 20తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ పకథాన్నిని అక్టోబరు 21 నుంచి మరో 180 రోజుల వరకు పొడిగించింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రత ఇప్పటికీ తగ్గకపోవడం, దేశంలో కోవిడ్ సంబంధిత విధులు నిర్వహిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లు మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోవిడ్ రోగులకు సేవలందించే హెల్త్‌‌కేర్ వర్కర్లపై ఆధారపడిన వారికి భద్రత, రక్షణ కల్పించేందుకు ఈ పథకాన్ని పొడిగించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 1,351 క్లెయిములకు డబ్బు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పీఎంజీకేపీ బీమా పథకం..
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఎంతోమంది హెల్త్ వర్కర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారిలో స్థైర్యం నింపేందుకు, వారి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2020, మార్చి 30వ తేదీన పీఎంజీకేపీ బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.50 లక్షలు వరకు సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ఉంది. కోవిడ్-19 రోగులకు సేవలందిస్తూ, ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసే హెల్త్‌కేర్ వర్కర్లు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..