కరోనా కాలంలో కూడా.. ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం..

| Edited By:

Jul 04, 2020 | 3:46 PM

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు స్మగ్లర్లు మాత్రం వారి పని వారు చేస్తున్నారు. అదే సమయంలో కస్టమ్ డిపార్ట్‌మెంట్‌ కూడా వారిపై డేగ కన్నేసి మరీ పట్టుకుంటుంది. తాజాగా..

కరోనా కాలంలో కూడా.. ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం..
Follow us on

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు స్మగ్లర్లు మాత్రం వారి పని వారు చేస్తున్నారు. అదే సమయంలో కస్టమ్ డిపార్ట్‌మెంట్‌ కూడా వారిపై డేగ కన్నేసి మరీ పట్టుకుంటుంది. తాజాగా వందే భారత్‌ మిషన్‌లో భాగంగా పద్నాలుగు మంది వ్యక్తులు రస్-ఉల్-కేమా( యూఏఈ), సౌదీ అరేబియాలోని రియాద్‌ నుంచి జైపూర్ చేరుకున్నారు. అయితే వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్ట్ కి యూఏఈ, సౌదీ అరేబియా నుంచి రెండు చార్టర్ ఫ్లైట్స్‌ చేరుకున్నాయి. వీటిలో వచ్చిన పద్నాలుగు మంది దగ్గర నుంచి 31.9918 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.15.67 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని వందే భారత్ మిషన్‌లో ప్రత్యేక విమానాల్లో మన దేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.