దీపావళికి గుడ్లగూబకు లింక్.. కారణం సూపర్బ్ !!

| Edited By:

Oct 25, 2019 | 12:48 PM

సంప్రదాయాలకు, ఆచారాలకు కేరాఫ్ అడ్రస్ భారత్. పండుగలొస్తే చాలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం. అయితే ఈ ఆచారాలతో పాటు.. పలు చోట్ల మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా జంతుబలి కూడా ఒకటి. అయితే కొన్ని చోట్ల పండుగలకు అమ్మవార్లకు కోడి, మేకలను బలివ్వడం చూస్తుంటాం. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఈ ఆచారం ఎక్కువగా కొనసాగుతోంది. ఇక మరికొన్ని చోట్ల దున్నపోతులను కూడా బలిస్తుంటారు. అయితే తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ […]

దీపావళికి గుడ్లగూబకు లింక్.. కారణం సూపర్బ్ !!
Follow us on

సంప్రదాయాలకు, ఆచారాలకు కేరాఫ్ అడ్రస్ భారత్. పండుగలొస్తే చాలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం. అయితే ఈ ఆచారాలతో పాటు.. పలు చోట్ల మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా జంతుబలి కూడా ఒకటి. అయితే కొన్ని చోట్ల పండుగలకు అమ్మవార్లకు కోడి, మేకలను బలివ్వడం చూస్తుంటాం. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఈ ఆచారం ఎక్కువగా కొనసాగుతోంది. ఇక మరికొన్ని చోట్ల దున్నపోతులను కూడా బలిస్తుంటారు. అయితే తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. లక్ష్మీ కటాక్షం కోసం ఓ పక్షిని బలివ్వడం. అది కూడా అంతా అశుభంగా భావించే గుడ్లగూబను.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ఘటన వెలుగుచూసింది. అక్రమంగా గుడ్లగూబలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని విచారించగా పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఆ గుడ్లగూబలను బ్లాక్ మార్కెట్‌లో లక్షల రూపాయలకు విక్రయిస్తారని తేలింది. అయితే గుడ్లగూబలకు ఇంత డిమాండ్ ఏంటని ఆరా తీయగా.. రాబోయే దీపావళి సందర్భంగా గుడ్లగూబలకు డిమాండ్ బాగా ఉంటుందని తేలింది. దీపావళి పండుగ రోజు లక్ష్మి పూజ సందర్భంగా గుడ్లగూబను బలిస్తే.. ఆ ఇంట్లో లక్ష్మి దేవి కొలువుదీరుతుందని చాలామంది విశ్వసిస్తారన్న విషయం ఆ ముఠా ద్వారా పోలీసులకు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అంతేకాదు గుడ్లగూబల ఎముకలు కూడా మార్కెట్లో అధిక ధర పలుకుతాయని.. అందుకే వాటిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఘజియాబాద్‌లోని వైశాలి సెక్టార్‌5లో ఒక బకెట్‌లో వాటిని దాచిపెట్టి తరలిస్తుండగా ఇద్దర్ని పట్టకున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో గుడ్లగూబలకి ఆగ్రా హబ్‌గా దందా కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో దీపావళి రోజు గుడ్లగూబను బలిచ్చే ఆచారం కొనసాగుతోందని పోలీసులు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా, హిందూ పురాణాల్లోనూ ఈ గుడ్లగూబ ప్రస్తావన ఉంది. ప్రస్తుతం చాలామంది దీనిని అశుభంగా భావిస్తారు కానీ.. పురాణాల్లో శుభసూచకంగా పేర్కొన్నట్టు చెబుతారు. రాత్రి నాలుగవ జాములో గుడ్లగూబ ఎవరి ఇంటిపై వాలుతుందో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాల్లో ఉన్నట్లు చెబుతారు. అయితే త్వరగా ధనవంతులు కావడం కోసం గుడ్లగూబను బలి ఇచ్చే మూఢ ఆచారాలు కొనసాగుతున్నాయి. అయితే గుడ్లగూబ లక్ష్మీ దేవి వాహనమని.. ఇలా చేయోద్దని కూడా చెబుతుంటారు. కానీ మూఢనమ్మకాల పేరుతో ఈ పక్షులతో వ్యాపారం చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా గుడ్లగూబలను బలి ఇస్తున్న ఘటనలు కూడా ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. మరికొందరు వశీకరణ పేరుతో కూడా ఈ గుడ్లగూబలను బలిస్తుంటారట. ఇదే మూఢ నమ్మకాన్ని ఆసరా చేసుకుని స్మగ్లర్లు గుడ్లగూబలతో వ్యాపారం ప్రారంభించారు. మార్కెట్లు వీటికి డిమాండ్ పెంచి.. ఒక్కో గుడ్లగూబను దాదాపు రూ.30వేల నుంచి రూ.50వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గుడ్లగూబలను బలి ఇస్తే ధనవంతులు అవుతారనేది మూఢ నమ్మకం మాత్రమేనని.. ఇది స్మగ్లర్లు చేస్తున్న డ్రామాగా భావిస్తున్నారు.