Covid: టీకా వేసుకున్నా.. నిబంధనలు పాటించాలి.. పండుగ సీజన్‎లో జాగ్రత్తగా ఉండాలి..

కేంద్ర, రాష్ట్ర సహకారంతో భారతదేశం 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌ల మైలురాయిని సాధించిందని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా అనేది కరోనా తగ్గించడంలో ఒకటి అని తెలిపింది. కోవిడ్‌ జాగ్రత్తలు పాటించడం కొనసాగించాలని నొక్కి చెప్పింది...

Covid: టీకా వేసుకున్నా.. నిబంధనలు పాటించాలి.. పండుగ సీజన్‎లో జాగ్రత్తగా ఉండాలి..
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Oct 24, 2021 | 8:21 AM

కేంద్ర, రాష్ట్ర సహకారంతో భారతదేశం 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌ల మైలురాయిని సాధించిందని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా అనేది కరోనా తగ్గించడంలో ఒకటి అని తెలిపింది. కోవిడ్‌ జాగ్రత్తలు పాటించడం కొనసాగించాలని నొక్కి చెప్పింది. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం కొనసాగించాలని కోరింది. రద్దీగా ఉండే ప్రదేశాలను వెళ్లొద్దని, బహిరంగ సమావేశాలపై పరిమితులు విధించాలని కోరింది. ఈ జాగ్రత్తలు భవిష్యత్తులో కోవిడ్ -19 పుంజుకునే ప్రమాదాన్ని నివారిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మనం అప్రమత్తంగా ఉండాలంది.

పండుగలను అత్యంత జాగ్రత్తలతో జరుపుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోరింది. సమయానుకూలంగా జారీ చేయబడే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ని పాటించాలని కోరింది. పండుగల సమయంలో COVID-19 వ్యాప్తి చెందుతుందని తెలిపింది. కరోనా కట్టుబడి గురించి ప్రజలకు తెలియజేయడంలో మీడియా ముందంజలో ఉందని వెల్లడించింది. రానున్న పండుగల నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు ప్రజలకు తెలియజేయడానికి సందేశాలు ప్రసారం చేయాలని కోరింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ సాటిలైట్ ఛానళ్లకు లేఖ రాసింది.

Read Also.. Goat Milk: మేక పాలతో డెంగ్యూకు చెక్‌.? దెబ్బకు పెరిగిన డిమాండ్.. లీటర్ ధర ఎంతో తెలిస్తే షాకే.!