కరోనా కాలంలో కశ్మీర్‌ లోయలో ఉగ్రవేట.. నలుగురు ఉగ్రవాదులు హతం..

| Edited By:

Apr 22, 2020 | 1:21 PM

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఇదే అదనుగా భావించి భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జిల్లాలోని మల్‌హురా జాన్‌పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులు చేపట్టారు.ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను […]

కరోనా కాలంలో కశ్మీర్‌ లోయలో ఉగ్రవేట.. నలుగురు ఉగ్రవాదులు హతం..
Follow us on

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఇదే అదనుగా భావించి భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జిల్లాలోని మల్‌హురా జాన్‌పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులు చేపట్టారు.ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత నెల రోజులుగా ఇదే ప్రాంతంలో ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.