జమ్ములో నలుగురు ఉగ్రవాదులు హతం

| Edited By: Pardhasaradhi Peri

Jun 22, 2020 | 9:38 AM

జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్, కుల్గామ్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ములో నలుగురు ఉగ్రవాదులు హతం
Follow us on

జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్, కుల్గామ్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకరిని షకూర్‌ ఫరూక్‌ లాంగూగా గుర్తించారు. గతనెల 20న ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లను చంపిన కేసులో షకూర్ నిందితుడు. ఆ సమయంలో మరణించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ రైఫిల్‌ని ఫరూక్ దొంగలించగా.. తాజాగా జవాన్లు ఆ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో హతుడు షహీద్‌ అహ్మద్‌ భట్‌ అని అధికారులు తెలిపారు. వీరు హిజ్బుల్‌ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారని అధికారులు పేర్కొన్నారు. అలాగే కుల్గామ్‌ జిల్లాలో తయాబ్‌ వలీద్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ భాయ్ అలియాస్‌ గజీ బాబా అనే పాక్ దేశస్తుడిని మట్టుబెట్టారు. జైషే మొహమ్మద్‌ కమాండర్‌గా ఉన్న ఇమ్రాన్ బాంబుల తయారీలో సిద్ధహస్తుడని అధికారులు తెలిపారు. మరో ఉగ్రవాది వివరాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ నెలలో ఇప్పటివరకు 31 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Read This Story Also: అహోబిలం గుడి పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్