ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం సరికాదు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్

| Edited By:

Jul 20, 2019 | 4:46 AM

దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకదాడుల్ని అరికట్టవలసిన అవసరముందన్నారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఫర్దరింగ్‌ ఇండియాస్‌ ప్రామిస్‌ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశంలో వచ్చిన పలు మార్పులపై మాట్లాడారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. పంచవర్ష ప్రణాళికల వల్లే దేశంలో విద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న […]

ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం సరికాదు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్
Follow us on

దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకదాడుల్ని అరికట్టవలసిన అవసరముందన్నారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఫర్దరింగ్‌ ఇండియాస్‌ ప్రామిస్‌ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశంలో వచ్చిన పలు మార్పులపై మాట్లాడారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. పంచవర్ష ప్రణాళికల వల్లే దేశంలో విద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించిందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న వారు స్వాతంత్ర్యం వచ్చిన నాటితో పోలిస్తే భారత్ ఇప్పుడు ఎక్కడ ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారని, కాంగ్రెసేతర ప్రభుత్వాలు సైతం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయంటూనే ..మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ప్రణబ్ తప్పుబట్టారు. భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి గత ప్రభుత్వాలు వేసిన బలమైన పునాదులే కారణమని తెలిపారు.