మా అధినేత్రినే దూరం పెడతారా.. ట్రంప్‌తో విందుకు దూరంగా మన్మోహన్..మరికొందరు..!

| Edited By:

Feb 24, 2020 | 11:37 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దూరం ఉంటున్నట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం.. డోనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా.. పలువురు కాంగ్రెస్‌ నేతలకు కూడా ఆహ్వానించారు. అయితే తొలుత ఈ విందుకు ఓకే చెప్పిన […]

మా అధినేత్రినే దూరం పెడతారా.. ట్రంప్‌తో విందుకు దూరంగా మన్మోహన్..మరికొందరు..!
Follow us on

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దూరం ఉంటున్నట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం.. డోనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా.. పలువురు కాంగ్రెస్‌ నేతలకు కూడా ఆహ్వానించారు. అయితే తొలుత ఈ విందుకు ఓకే చెప్పిన మన్మోహన్.. ఇప్పుడు వెళ్లట్లేదని తెలుస్తోంది. అలాగే రాజ్యసభ సభ్యులు గులాం నభీ ఆజాద్ కూడా.. ఈ విందుకు గైర్హాజరవుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ విందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆహ్వానం రాకపోవడంతో.. అంసతృప్తి వ్యక్తం చేస్తూ విందుకు హాజరవ్వడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఇప్పటికే స్పష్టం చేశారు.