ఎట్టకేలకు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు విముక్తి.. కానీ..

| Edited By:

Mar 13, 2020 | 7:25 PM

జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. అక్కడి నేతలను గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు శుక్రవారం.. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా‌పై విధించిన గృహ నిర్బంధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. శ్రీనగర్‌‌లో గుప్కార్‌ రోడ్డులోని ఆయన నివాసంలో.. ఫరూక్ అబ్దుల్లాను గతేడాది ఆగస్టు నుంచి నిర్బంధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆయనపై ప్రజా భద్రత చట్టాన్ని (పీఎస్ఏ)ని కూడా ప్రయోగించింది. అయితే ఈ […]

ఎట్టకేలకు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు విముక్తి.. కానీ..
Follow us on

జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. అక్కడి నేతలను గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు శుక్రవారం.. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా‌పై విధించిన గృహ నిర్బంధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. శ్రీనగర్‌‌లో గుప్కార్‌ రోడ్డులోని ఆయన నివాసంలో.. ఫరూక్ అబ్దుల్లాను గతేడాది ఆగస్టు నుంచి నిర్బంధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆయనపై ప్రజా భద్రత చట్టాన్ని (పీఎస్ఏ)ని కూడా ప్రయోగించింది. అయితే ఈ క్రమంలో ముగ్గురు మాజీ సీఎంలతో పాటు.. జమ్మూ కశ్మీర్‌లో నిర్బంధంలోకి తీసుకున్న రాజకీయ నేతలందర్నీ విడుదల చేయాలంటూ ఎనిమిది రాజకీయ పార్టీలు.. ప్రధాని మోదీకి ఉమ్మడిగా తీర్మానం పంపాయి. ఇలా పంపిన నాలుగు రోజులకే.. ప్రభుత్వం ఫరూక్‌ అబ్దుల్లాకి విముక్తిని కల్పించింది.

గృహనిర్బంధంలో.. ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు ఆయ‌న కుమారుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ చీఫ్‌ ముఫ్తీ మహ్మద్‌లు ఉన్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఫరూక్ అబ్దుల్లా‌పై విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం.. ఒమర్‌ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధాన్ని ఇంకా కొనసాగిస్తోంది.