నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

|

Aug 07, 2020 | 10:46 PM

కృష్ణమ్మ ఎగువ ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జునసాగర్‌కు వరద వస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 29,562 క్యూసెక్కులు ఉంది. ఎడమ కాలువ నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 557.10 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 […]

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
Follow us on

కృష్ణమ్మ ఎగువ ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జునసాగర్‌కు వరద వస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 29,562 క్యూసెక్కులు ఉంది.

ఎడమ కాలువ నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 557.10 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 225.6924 నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం ఇలానే మరో 10 రోజులు కొనసాగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.