Viral: అతనో ఫ్లైట్ అటెండెంట్.. నడక, నడత కాస్త తేడాగా ఉంది.. అధికారులు ఆపి చెక్ చేయగా..

|

May 27, 2022 | 4:13 PM

గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పాచికలు పారడం లేదని.. ఏకంగా ఫ్లైట్ సిబ్బందితో, కస్టమ్స్ సిబ్బందితో డీల్స్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Viral: అతనో ఫ్లైట్ అటెండెంట్.. నడక, నడత కాస్త తేడాగా ఉంది.. అధికారులు ఆపి చెక్ చేయగా..
representative image
Follow us on

నిఘా పెంచినప్పటికీ విమానాశ్రయాల ద్వారా బంగారం స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. రకరకాల మార్గాల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. కమీషన్‌కు ఆశపడి కొందరు వ్యక్తులు కడుపులో దాచుకుని మరీ బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలు మనం చూశాం. అంతేకాదు విమాన సిబ్బందితో, కస్టమ్స్ అధికారులతో బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలు చేతులు కలిపిన సందర్భాలు గతంలో చాలాసార్లు వెలుగుచూశాయి. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ.. ఒక ఫ్లైట్ అటెండెంట్.. కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌(Calicut International Airport)లో… అధికారులకు చిక్కాడు.  అతను గతంలో 6 సార్లు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడిని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌(Air India Express )లో క్యాబిన్ క్రూలో పనిచేసే నవనీత్ సింగ్‌గా గుర్తించారు. 4.5 కోట్ల విలువ చేసే 1.25 కేజీల బంగారాన్ని అతను బూట్లలో దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని విమానంలోని వాష్‌రూమ్‌లో పెడుతుంది. దానిని బూట్లలో దాచిపెట్టి అధికారులకు చిక్కకుండా బయటకు తేవడం నవనీత్ పని. ఇలా చేసినందుకు ప్రతిసారీ తనకు 3 లక్షలు ఇచ్చినట్లు నవనీత్ అంగీకరించాడు. దీని వెనుక మలప్పురానికి(Malappuram) చెందిన బంగారం స్మగ్లింగ్ ముఠా హస్తం ఉందని వెల్లడించాడు. రెండు నెలల క్రితమే బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విమాన సిబ్బందిని కరిపూర్‌లోని కాలికట్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..