24 గంటలు.. రెండు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు..

| Edited By:

Jun 30, 2020 | 6:19 PM

కశ్మీర్‌ లోయలో ఉగ్రవేట ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. గడిచిన ఆరు నెలల్లో వంద మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది భారత సైన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు..

24 గంటలు.. రెండు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు..
Follow us on

కశ్మీర్‌ లోయలో ఉగ్రవేట ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. గడిచిన ఆరు నెలల్లో వంద మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది భారత సైన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ విషయాన్ని కశ్మీర్‌ ఐజీ తెలిపారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని వాఘమా ప్రాతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు కాల్పులు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇదే ప్రాంతంలో సోమవారం నాడు కూడా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు.. ఇటీవల ఇద్దరు సీఆర్పీఎఫ్ జవన్లతో పాటు ఓ ఐదేళ్ల పాపను చంపిన ఉగ్రవాదులుగా గుర్తించారు.