Rahul Gandhi: ఇవాళ భారత్‌ జోడో యాత్ర ముగింపు.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో బహిరంగ సభకు 22 మంది విపక్షపార్టీల నేతలు..

|

Jan 30, 2023 | 7:06 AM

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ఇవాళ శ్రీనగర్‌లో ముగుస్తుంది. లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్‌. ముగింపు సభకు 12 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నారు. ఆ ప్రాంతంలో టైట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

Rahul Gandhi: ఇవాళ భారత్‌ జోడో యాత్ర ముగింపు.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో బహిరంగ సభకు 22 మంది విపక్షపార్టీల నేతలు..
Rahul Gandhi Bharat Jodo Yatra
Follow us on

కశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్ర తుదిదశకు చేరుకుంది. శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్‌చౌక్‌లో రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం లభించింది. లాల్‌చౌక్‌ దగ్గర జాతీయ జెండాను ఎగురవేశారు. రాహుల్‌తో పాటు ప్రియాంకాగాంధీ కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.లాల్‌చౌక్‌లో రాహుల్‌గాంధీ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాహుల్‌ యాత్రను దృష్టిలోపెట్టుకొని లాల్‌చౌక్‌ ప్రాంతంలో అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం మొత్తాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకొన్నాయి. యాత్ర ముగింపుసభ జరిగే లాల్‌చౌక్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

ఈ సభకు దేశం నలుమూలల నుంచి 22 మంది విపక్ష పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. వారిలో 12 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్తొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఐతే టీఎంసీ , సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఈ సభకు హాజరుకావడం లేదు. ఇక డీఎంకే నుంచి ఎంకే స్టాలిన్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌, శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే, , నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేఎంఎం పార్టీల నాయకులు పాల్గొనే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లడించారు.

గతేడాది సెప్టెంబర్‌ 7వ తేదీన రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. 3,970 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర కొనసాగింది. 12 రాష్ట్రాలు , రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 145 రోజుల పాటు రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర సాగింది. పలువురు ప్రముఖులు భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం