జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో నయా శకం.. తెరపైకి కొత్త పార్టీ..!

| Edited By:

Mar 07, 2020 | 9:21 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో అనేక మార్పులు వచ్చాయి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత.. ఇప్పుడు మళ్లీ సామాన్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు పలువురు కీలక నేతల్ని గృహనిర్భందంలోనే ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజకీయంగా ఇక్కడ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో కొత్త పార్టీ అవతరించనుంది. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని. ‘జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ’ పేరుతో ఈ కొత్త పార్టీని […]

జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో నయా శకం.. తెరపైకి కొత్త పార్టీ..!
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో అనేక మార్పులు వచ్చాయి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత.. ఇప్పుడు మళ్లీ సామాన్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు పలువురు కీలక నేతల్ని గృహనిర్భందంలోనే ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజకీయంగా ఇక్కడ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో కొత్త పార్టీ అవతరించనుంది. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని. ‘జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ’ పేరుతో ఈ కొత్త పార్టీని పీడీపీ మాజీ మంత్రి అల్టాఫ్ బుఖారి ప్రారంభించనున్నారు. ఆదివారం శ్రీనగర్‌లో ఈ పార్టీ ఆవిష్కరణ జరగనున్నట్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిపై ‘జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ’ ప్రత్యేక దృష్టి పెట్టబోతుందని బుఖారీ తెలిపారు.

అయితే.. ఈ పార్టీలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రతినిధులతో పాటుగా.. కశ్మీరీ పండిట్లను కూడా చేర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 30 మంది నేతలు ఈ కొత్త పార్టీ కండువా కప్పుకునేలా ప్లాన్ వేశారు.