
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. శనివారం ఉదయం ఇంటి సమీపంలోని గార్డెన్లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గమనించి రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అజిత జోగీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు.. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందన్న్ననారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా, అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు అమిత్ జోగీ కూడా స్పందించారు. ప్రస్తుతం తన తండ్రికి వెంటిలేటర్‌పై చికిత్స అందుతుందని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తడంతోనే వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు.