పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌..!

| Edited By:

Jun 26, 2020 | 6:09 PM

ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) సంస్థ బ్యాడ్‌న్యూస్ చెప్పనుందని సమాచారం. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటును మరోసారి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌..!
Follow us on

ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) సంస్థ బ్యాడ్‌న్యూస్ చెప్పనుందని సమాచారం. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటును మరోసారి సంస్థ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. 2019-20 సంవత్సరానికి గానూ ఇప్పటికే 8.65 నుంచి  8.5 శాతానికి వడ్డీ రేటును తగ్గించిన సంస్థ.. తాజాగా 8.1 శాతానికి కోత పెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మార్కెట్ అస్థిరత, ఆదాయం  భారీగా క్షీణించిన కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌..  ఈపీఎఫ్ఓ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్‌ఐఐసీ)తో త్వరలోనే సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగులు, యజమానుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు, చాలామంది ఖాతాదారులు తమ డబ్బులను విత్‌డ్రా చేయడం, ద్రవ్య లభ్యతపై ప్రభావం చూపిందని  భావిస్తున్నారు. ఇక తాజా వడ్డీ రేట్లలో కోత దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులను ప్రభావితం చేయనుందని సమాచారం. కాగా  పీఎఫ్‌ ఖాతాలపై వడ్డీరేటును 8.65 నుంచి  8.5 శాతానికి కుదించినట్లు సంతోష్‌ గాంగ్వర్‌  మార్చి మొదటి వారంలో ప్రకటించినా.. దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదం తెలపని విషయం తెలిసిందే.