Breaking: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. తెలుగు డాన్ హతం..!

| Edited By:

Feb 20, 2020 | 7:32 AM

ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను హడలెత్తించిన డాన్ శివశక్తినాయుడు మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఏసీపీని చంపేందుకు

Breaking: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. తెలుగు డాన్ హతం..!
Follow us on

Meerut Encounter: ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను హడలెత్తించిన డాన్ శివశక్తినాయుడు మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఏసీపీని చంపేందుకు కుట్ర చేస్తోన్న సమయంలో.. అతడు పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఘటనలో మరో పోలీస్ కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. శివశక్తి స్థావరం నుంచి ఓ కార్వాన్, డబుల్ బారెల్ గన్, పలు రౌండ్ల బులెట్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

కాగా శివశక్తి తండ్రి తెలుగు వాడే. బతుకుతెరువు కోసం ఎప్పుడో ఢిల్లీకి వెళ్లిన ఆయన అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ అతడు వస్త్ర దుకాణాన్ని నడిపేవాడు. తొలత తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉన్న శివశక్తి.. తరువాత డబ్బు మీద మోజుతో డాన్ అవతారమెత్తాడు. ఢిల్లీలో ఇప్పటివరకు ఇతడే నంబర్‌1 డాన్‌గా చెప్పుకుంటారు.

అంతేకాదు హవాలా వ్యాపారం చేసిన శివశక్తి.. 2014లో ఓ వ్యాపారి నుంచి రూ.8కోట్లు లూటీ చేసి వార్తల్లోకెక్కాడు. సుపారీ హత్యలు, దారి దోపిడీలు, కిడ్నాప్‌ల్లో అతడు ఆరితేరాడు. సెలబ్రిటీల నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన చరిత్ర శివశక్తికి ఉంది. జైపూర్‌లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా నుంచి రూ.8కోట్ల రూపాయలు బెదిరించి వసూల్ చేశాడు శివశక్తి. లూథియానాలో ఓ వ్యాపారి నుంచి ఆరు కోట్లు వసూలు చేశాడు. ఈ క్రమంలో ఆరేళ్ల పాటు తీహార్ జైల్లోనూ గడిపిన నాయుడు.. ఆ తరువాత పెరోల్‌ మీద విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

తాజాగా ఢిల్లీకి 70కి.మీల దూరంలో మీరట్ నగరంలో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో శివశక్తి నాయుడు నక్కినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు వెళ్లగా అపార్ట్‌మెంట్‌‌లో నుంచి వారిపైకి శివశక్తి కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. శివశక్తికి బాలీవుడ్ సినిమాలంటే పిచ్చి. తనను తాను డాన్‌గా ఊహించుకొని పలు వీడియోలు యూట్యూబ్‌ ఛానెల్‌లో అతడు విడుదల చేశాడు. శివశక్తి నాయుడుకు ఢిల్లీతో పాటు జమ్ము కశ్మీర్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో స్థావరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. తన నేర సామ్రాజ్యాన్ని పలు రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఉండగానే.. పోలీసులు అతడిని హతమార్చారు.