Power Bill: అక్రమంగా కరెంట్ వినియోగించిన నాయకుడు.. భారీ మొత్తంలో జరిమానా విధించిన విద్యుత్ శాఖ

| Edited By: Shaik Madar Saheb

Nov 17, 2023 | 4:58 PM

దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో నూనె దీపాలు, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రం కాంతులను వెదజల్లింది. అయితే ఈ కాంతుల వెనుక కొందరు నాయకులు అక్రమంగా కరెంటును వినియోగించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యుత్ శాఖ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.

Power Bill: అక్రమంగా కరెంట్ వినియోగించిన నాయకుడు.. భారీ మొత్తంలో జరిమానా విధించిన విద్యుత్ శాఖ
Electricity Department Fine Kumaraswamy For Illegal Consumption Of Electricity On The Occasion Of Diwali
Follow us on

దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో నూనె దీపాలు, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రం కాంతులను వెదజల్లింది. అయితే ఈ కాంతుల వెనుక కొందరు నాయకులు అక్రమంగా కరెంటును వినియోగించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యుత్ శాఖ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ అక్రమ కరెంటు వ్యవహారంలో చిక్కుకున్నారు. దీపావళి సందర్బంగా జయనగర్‌లోని బెస్కామ్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారులు కుమారస్వామి ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం జరిమానా విధించారు. ఇక గద్యంతరం లేక రూ. 68,526 చెల్లించారు. అధికారులు విధించిన జరిమానాను కుమార స్వామి ఆన్లైన్లో చెల్లించిన రశీదు టీవీ9 చేతికి చిక్కింది.

ఈ అక్రమ కరెంట్ వాడకంపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి. బెస్కామ్ (BESCOM) 2.5 కిలో వాట్‌కు లెక్కలు వేసిందని వెల్లడించారు. మొత్తం ఏడు రోజులకు గానూ 71 యూనిట్లు వినియోగించినట్లు గుర్తించారు. సాధారణంగా కరెంట్ అందించే సంస్థ బెస్కామ్ ప్రకారం 71 యూనిట్లకు రూ. 2,526 బిల్లు రావాలి. కానీ రూ. 68,526 వచ్చినట్లు రశీదు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..