Vice President Election Date: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఎలా ఎన్నుకుంటారంటే?

|

Jun 29, 2022 | 5:19 PM

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అవసరమైతే ఆగస్టు 6న ఓటింగ్‌ నిర్వహిస్తారు. జులై 7 నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జులై 19 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం. జులై 20న దరఖాస్తుల పరిశీలన

Vice President Election Date: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఎలా ఎన్నుకుంటారంటే?
Vice President Venkaiah Naidu
Follow us on

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకుషెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ వివరాలను ఖరారు చేసింది. ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొంది. జులై 17 నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీగా పేర్కొంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. అవసరమైతే ఆగస్టు 6న ఓటింగ్‌ నిర్వహిస్తారు.

  • ఎన్నికలకు పిలుపునిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ | 5.07.2022 (మంగళవారం)

  • నామినేషన్ల చివరి తేదీ | 19.07.22 (మంగళవారం)

  • నామినేషన్ల పరిశీలన తేదీ | 20.07.2022 (బుధవారం)

  • అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 22.07.2022 (శుక్రవారం)

  • అవసరమైతే, ఒక పోల్ తేదీ | 06.08.2022 (శనివారం)

  • పోల్ సమయం | ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు

  • అవసరమైతే, కౌంటింగ్ తేదీ | 06.08.2022 (శనివారం)

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వారసుడిని నిర్ణయించే ఎన్నికల నోటిఫికేషన్ జూలై 5న విడుదల కానుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు జూలై 19 చివరి తేదీ. జూలై 20న నామినేషన్ పత్రాల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22 చివరి తేదీ అని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే?

ఉప రాష్ట్రపతిని పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకొని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

జాతీయ వార్తల కోసం