బంగ్లా, భారత్ సరిహద్దుల్లో కంపించిన భూమి

|

Jun 03, 2020 | 10:51 AM

Earthquake of magnitude : ఓ వైపు నిసర్గ దూసుకొస్తుంటే… మరో వైపు భూ ప్రకంపనలు మరింత భయపెడుతున్నాయి. ఈ ఉదయం 7.10 నిమిషాలకు బంగ్లాదేశ్, భారత్ సరిహద్దుల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదయినట్లు జాతీయ భూకంప అధ్యాయన విభాగం (ఎన్‌సీఎస్‌) తెలిపింది. ఢిల్లీకి సమీపంలో భూమి కంపించడం ఇది నాలుగోసారి. భూకంప కేంద్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు అత్యంత సమీప ప్రాంతంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ అధికారులు గుర్తించారు. nisarga […]

బంగ్లా, భారత్ సరిహద్దుల్లో కంపించిన భూమి
Earthquake
Follow us on

Earthquake of magnitude : ఓ వైపు నిసర్గ దూసుకొస్తుంటే… మరో వైపు భూ ప్రకంపనలు మరింత భయపెడుతున్నాయి. ఈ ఉదయం 7.10 నిమిషాలకు బంగ్లాదేశ్, భారత్ సరిహద్దుల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదయినట్లు జాతీయ భూకంప అధ్యాయన విభాగం (ఎన్‌సీఎస్‌) తెలిపింది. ఢిల్లీకి సమీపంలో భూమి కంపించడం ఇది నాలుగోసారి. భూకంప కేంద్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు అత్యంత సమీప ప్రాంతంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ అధికారులు గుర్తించారు.

nisarga cyclone : మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై వైపు నిసర్గ తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ రాకాసి తుఫాను దూసుకొస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై ఈ తుఫాన్‌ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించడంతో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను ఇవాళ తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.