మణిపూర్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు

|

Oct 16, 2020 | 9:04 AM

ఈశాన్య భారతం మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. గత కొద్దిరోజులుగా మణిపూర్ తోసహా పలు రాష్ట్రాల్లో తరుచు భూకంపం సంభవిస్తుంది.

మణిపూర్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు
Follow us on

ఈశాన్య భారతం మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. గత కొద్దిరోజులుగా మణిపూర్ తోసహా పలు రాష్ట్రాల్లో తరుచు భూకంపం సంభవిస్తుంది. అయితే, ఎలాంటి ప్రాణ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా మరోసారి మణిపూర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. మణిపూర్ పరిధిలోని బిష్ణుపూర్ లో బుధవారం రాత్రి 9.05 గంటలకు భూకంపం సంభవించింద. బిష్ణుపూర్ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో 36 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. గత వారం మణిపూర్ లో రెండు సార్లు భూమి కంపించింది. గతంలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. మణిపూర్ లో వరుస భూకంపాలతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అయితే, ఇలాంటి భూకంపాలతో భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. భూమి పొరల్లో సర్ధుబాటు వల్ల ఇలాంటి భూకంపాలు వస్తాయని అధికారులు తెలిపారు.