DRDO: ఆకాశ్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. వాయుసేనకు రక్షణ కవచం కానున్న క్షిపణి

|

Jan 25, 2021 | 6:36 PM

Akash-NG Missile: ‌భార‌త ర‌క్షణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రక్షణ రంగంలో మరో అడుగు ముందుకువేసింది. ఆకాశ్-ఎన్‌జీ (న్యూ జ‌న‌రేష‌న్‌) క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం అధికారులు ఈ క్షిప‌ణి ప‌రీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఆకాశ్‌-న్యూ జనరేషన్ క్షిపణిని డీఆర్‌డీవో ఆధునిక సాంకేతిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ కొత్త తరం క్షిపణి భార‌త వాయుసేనకు రక్షణ కవచంలా మారనుంది. ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న […]

DRDO: ఆకాశ్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. వాయుసేనకు రక్షణ కవచం కానున్న క్షిపణి
Follow us on

Akash-NG Missile: ‌భార‌త ర‌క్షణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రక్షణ రంగంలో మరో అడుగు ముందుకువేసింది. ఆకాశ్-ఎన్‌జీ (న్యూ జ‌న‌రేష‌న్‌) క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం అధికారులు ఈ క్షిప‌ణి ప‌రీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఆకాశ్‌-న్యూ జనరేషన్ క్షిపణిని డీఆర్‌డీవో ఆధునిక సాంకేతిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ కొత్త తరం క్షిపణి భార‌త వాయుసేనకు రక్షణ కవచంలా మారనుంది. ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న త‌లంలోని శ‌త్రుదేశాల‌కు సంబంధించిన టార్గెట్‌ల‌ను చేధించ‌డానికి వాయుసేనకు తోడ్పాటునందిస్తుందని డీఆర్‌డీవో పేర్కొంది.

ఈ పరీక్షలో అకాశ్ ఎన్‌జీ మిస్సైల్ త‌న‌ ల‌క్ష్యాన్ని క‌చ్చిత‌మైన సమయంలో చేధించినట్లు వెల్లడించింది. ఆకాశ్ న్యూ జనరేషన్ మిస్సైల్.. క‌మాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఏవియోనిక్స్ అండ్ ఏయిరోడైన‌మిక్ కాన్ఫిగ‌రేష‌న్ స‌మర్థవంతంగా పనిచేసినట్లు డీఆర్‌డీవో తెలిపింది.‌ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నాటి నుంచి భారత్ తరచూ క్షిపణుల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులను తయారు చేస్తూ ముందడుగు వేస్తోంది.


Read Also:రూ.48వేల కోట్లతో తేజస్​ ఫైటర్​జెట్‌లు సమకూర్చడం హర్షనీయం, నెల్లూరు జిల్లా సొంతఊర్లో డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి.