హాస్పిటల్స్‌పై దాడులు చేస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే..

| Edited By:

Aug 14, 2019 | 6:21 AM

హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడులు చేసిన వారికి మూడేళ్లనుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించేలా కేంద్ర ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే ఈ ముసాయిదాను బహిర్గతం చేయనున్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ మంగళవారం వెల్లడించారు. హాస్పిటల్స్‌పై ఎవరైనా దాడిచేసినా, అక్కడ ఎలాంటి […]

హాస్పిటల్స్‌పై దాడులు చేస్తే  ఊచలు లెక్కపెట్టాల్సిందే..
Follow us on

హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడులు చేసిన వారికి మూడేళ్లనుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించేలా కేంద్ర ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే ఈ ముసాయిదాను బహిర్గతం చేయనున్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ మంగళవారం వెల్లడించారు.

హాస్పిటల్స్‌పై ఎవరైనా దాడిచేసినా, అక్కడ ఎలాంటి విధ్వంసానికి పాల్పడినా ఆరు నుంచి ఐదేళ్ల శిక్షతోపాటు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా కూడా విధించేలా ముసాయిదాను రూపొందించినట్టు తెలుస్తోంది.