సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌

| Edited By:

Oct 04, 2020 | 3:44 PM

కేరళలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివ్‌ ప్రచారాన్ని తట్టుకోలేక 35 ఏళ్ల వైద్యుడు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు

సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌
Follow us on

Doctor suicide Kerala: కేరళలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివ్‌ ప్రచారాన్ని తట్టుకోలేక 35 ఏళ్ల వైద్యుడు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. బాత్‌రూమ్‌ గోడపై సారీ అని రాసి ఆయన ఆత్మహత్యకు ఒడిగట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కొల్లామ్‌లో అనూప్‌ ఆర్థో కేర్ అనే ఆసుపత్రిని నడుపుతున్న అనూప్ కృష్ణన్‌ అందులో ఆర్ధోపెడిక్‌ సర్జన్‌గా పని చేస్తున్నారు. గత నెల 27న తన ఆసుపత్రిలో 7 ఏళ్ల బాలికకు ఆయన సర్జరీ చేసే సమయంలో ఆమె మరణించింది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో అనూప్‌పై కొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. వీటన్నింటిని భరించలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీనియర్ పోలీస్ అధికారి.. ఆపరేషన్ జరిగే సమయంలో బాలిక మరణించడం ఆయనను తీవ్రంగా బాధించిందని అన్నారు. అయితే అదే అసలు కారణమని తేల్చలేమని, దీనిపై దర్యాప్తు జరుగుతుందని పోలీస్ అధికారి వివరించారు.

Read More:

Bigg Boss 4: ‘జండర్ ఈక్వాలిటీ’ టాస్క్‌.. కంటెస్టెంట్‌లు అదరగొట్టేశారుగా

కుక్కల ముందు పిల్లాడి ‘భాంగ్రా’ స్టెప్పులు.. నవ్వులు పూయిస్తోన్న వీడియో