పంజాబ్ తరువాత ఇప్పుడు రాజస్తాన్ వంతు ! కాంగ్రెస్ పార్టీలో కీచులాటలు..నేడు సీఎల్ఫీ భేటీ ..?

| Edited By: Anil kumar poka

Jul 25, 2021 | 10:25 AM

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన లుకలుకలు అలా సద్దు మణిగాయో లేదో.. ఇప్పుడు రాజస్థాన్ వంతు వచ్చింది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవింద్ సింగ్

పంజాబ్ తరువాత ఇప్పుడు రాజస్తాన్ వంతు ! కాంగ్రెస్ పార్టీలో కీచులాటలు..నేడు సీఎల్ఫీ భేటీ ..?
Differences In Rajasthan Congress Cm Ashok Gehlot
Follow us on

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన లుకలుకలు అలా సద్దు మణిగాయో లేదో.. ఇప్పుడు రాజస్థాన్ వంతు వచ్చింది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా ఆదివారం అత్యవసరంగా పార్టీ ఎమ్మెల్యేలను సమావేశపరుస్తున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగదని ఆయన అంటున్నా.. దీన్ని నిర్వహించే సూచనలున్నాయని అంటున్నారు. పార్టీలో ఓ వర్గం సూచనప్రాయంగా ఈ విషయం తెలిపింది. అశోక్ గెహ్లాట్ ను కలిసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్. రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ అజయ్ మాకెన్ నిన్న సాయంత్రం జైపూర్ చేరుకున్నారు. ఇది అధికారిక మీట్ మాత్రమే అని వేణుగోపాల్ అంటున్నా.. ఇందులో ఏదో మతలబు ఉందని సచిన్ పైలట్ వర్గం అంటోంది. 18 మంది ఎమ్మెల్యేల మద్దతు గల సచిన్ పైలట్.. ఇప్పటికీ తన డిమాండ్లు నెరవేరలేదని ఆగ్రహంతో ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరించాలని, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనీ ఆయన చాలాకాలంగా కోరుతున్నారు.

గత ఏడాది కూడా పైలట్ ఢిల్లీకి వెళ్లి తన డిమాండ్లను పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించారు. ఇందుకు అశోక్ గెహ్లాట్ తగిన చర్యలు తీసుకుంటారని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి మీరిద్దరూ కలిసి పని చేయాలని అధిష్టానం ఆయనకు సూచించింది. కాగా తమ నేత డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదని పైలట్ వర్గం చెబుతోంది. కేబినెట్ లో తనవారికి పదవులు, అలాగే నామినేటెడ్ పోస్టుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పైలట్ పట్టు బడుతున్నారు. అయితే పంజాబ్ లో మొదట సీఎం అమరేందర్ సింగ్ మాదిరే రాజస్థాన్ లో కూడా సీఎం అశోక్ గెహ్లాట్ ఇందుకు విముఖత చూపుతున్నారు. (పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్దు నియామకాన్ని తొలుత అమరేందర్ సింగ్ ఇష్టపడకపోయినా ఆ తరువాత సర్దుకుపోయారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు).

మరిన్ని ఇక్కడ చూడండి : వెంకటేష్ గారు కాళ్లు పట్టుకున్నప్పుడు!అంటూ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన విలక్షణ నటుడు శ్రీతేజ్‌..:Narappa Shritej Video.

 News Watch: లక్ష కోట్ల దళిత బంధు.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 ఓరి దేవుడో…వ్యాక్సిన్‌ కోసం..జుట్టు ఉడేలా కొట్టుకున్న మహిళలు..వైరల్ అవుతున్న వీడియో..:Women fight for vaccine Video.

 ఆ ఊరిలో నిధినిక్షేపాల బావి..!అందుకేనేమో అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట..అది ఏంటో తెలుసుకుందాం..:Mysterious Village Video.