Dharmendra Pradhan: ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్.. స్కూటీ డ్రైవ్ చేస్తూ.. వీడియో

|

Apr 20, 2024 | 7:04 PM

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైస్పీడుతో ప్రచారం నిర్వహిస్తోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌ నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్‌ బరిలో ఉన్నారు.

Dharmendra Pradhan: ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్.. స్కూటీ డ్రైవ్ చేస్తూ.. వీడియో
Dharmendra Pradhan
Follow us on

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైస్పీడుతో ప్రచారం నిర్వహిస్తోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌ నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్‌ బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ధర్మేంద్ర ప్రధాన్ తనదైన శైలిలో ఓట్లను అభ్యర్థిస్తూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఎన్నికల ప్రచారం లో స్కూటర్‌పై తిరుగుతూ కనిపించారు. అంతేకాకుండా.. సంబల్‌పూర్‌లోని ఓ దుకాణంలో మద్దతుదారులతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడారు. ఓటర్లను ఆకట్టుకునేలా స్వయంగా స్కూటీని డ్రైవ్ చేస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

వీడియో చూడండి..

అంతేకాకుండా.. శనివారం ఉదయం వేళ సంబల్‌పూర్‌లోని అగ్నివీర్‌ ఆశావహులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ధర్మేంద్ర ప్రధాన్‌ సమావేశమయ్యారు. ఔత్సాహికుల సన్నాహాల గురించి ఆరా తీస్తూ, వారిని ప్రేరేపించేలా.. పలు విషయాలపై మాట్లాడారు.


ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలు మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం.. నాలుగు దశల్లో జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరుగుతాయి. ఏడు దశల్లో 543 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 19న పూర్తి కాగా.. రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ 1న జరగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..