Dharmendra Pradhan: ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..

|

Jul 15, 2024 | 9:12 PM

న్యూ ఢిల్లీ‎లోని జగన్నాథ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 46వ రథయాత్ర ఉత్సవంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన యాత్రలో కేంద్రమంత్రితో పాటూ పలువురు భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా, ఆధ్యాత్మిక శోభతో కనిపించింది. సుమారు 50 వేల మందికిపైగా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Dharmendra Pradhan: ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
Dharmendra Pradhan
Follow us on

న్యూ ఢిల్లీ‎లోని జగన్నాథ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 46వ రథయాత్ర ఉత్సవంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన యాత్రలో కేంద్రమంత్రితో పాటూ పలువురు భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా, ఆధ్యాత్మిక శోభతో కనిపించింది. సుమారు 50 వేల మందికిపైగా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేసింది ఆలయకమిటీ. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నాలుగు దేవతలను ఊరేగింపుగా ఆలయం ముందున్న ప్రధాన రహదారిపై ఊరేగించారు. రథాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.

ఆ రథయాత్ర నిర్వహించిన రహదారి గుండా భక్తుల సంకీర్తనలు, జై జగన్నాథ నినాదాలు, హూళుహుళీలు, శంఖం ఊదడం, ఘంటలు మోగించడం, కరతల, మరదల, ఝంజా, మృదంగ వంటి వాద్యాలను వాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రథం ముందు ‘ఛెరాపహంరా’ అనే సంప్రదాయ సేవను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ కార్యదర్శి దుర్యోధన్ ప్రధాన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర, స్థానిక ఎమ్మెల్యే సోమనాథ్ భారతి, డాక్టర్ ఎస్కేజేనా, డాక్టర్ రఘబ్ దాష్, కేదార్‌నాథ్ త్రిపాఠి, సూరజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..