Maharashtra Politics: మహారాష్ట్రలో బలపరీక్ష తర్వాత ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్..? ఏక్‌నాథ్ షిండేకు దక్కనుంది ఇదే..!

|

Jun 29, 2022 | 3:49 PM

బలపరీక్ష తర్వాత బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశం అనంతరం రెండోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అందులో ఉప ముఖ్యమంత్రిగా..

Maharashtra Politics: మహారాష్ట్రలో బలపరీక్ష తర్వాత ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్..? ఏక్‌నాథ్ షిండేకు దక్కనుంది ఇదే..!
Devendra Fadnavis And Eknat
Follow us on

అధికారంపై మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. వేగంగా మారుతున్న పరిణామంలో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్షకు ఆదేశించారు. ఇదిలా ఉంటే, బలపరీక్ష తర్వాత బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫడ్నవీస్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మెజారిటీ నిరూపించుకోకముందే శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని.. బీజేపీ కార్యవర్గ సమావేశం అనంతరం రెండోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అందులో ఉప ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ సందర్భంగా షిండే వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా ఉండవచ్చని సమాచారం.

ఎమ్మెల్యేలంతా ముంబై చేరుకుంటారు

మహారాష్ట్ర రాజకీయ గందరగోళం నాటకీయ మలుపు తిరుగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేయగా.. మరోవైపు ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా గౌహతిలోని హోటల్ నుంచి బయలుదేరారు. బలపరీక్ష అనంతరం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్లోర్ టెస్ట్ కు ముందే షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విమానంలో గోవా చేరుకుంటున్నట్లు సమాచారం. గోవాలో షిండే వర్గానికి చెందిన వారి కోసం చాలా గదులు బుక్ అయ్యాయి. ఈ ఎమ్మెల్యేలంతా బలపరీక్ష కోసం గురువారం మహారాష్ట్ర శాసనసభకు చేరుకోనున్నారు.

ఫ్లోర్ టెస్ట్ పై ‘సుప్రీం’..

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మెజారిటీ పరీక్షను కోరుతూ మహారాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కూడా కలిశారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలపరీక్షపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై బుధవారం సాయంత్రం 5 గంటలకు విచారణ జరగనుంది.

జాతీయ వార్తల కోసం..