Farmers Tractor Rally: ఈనెల 26వ తేదీన రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు

|

Jan 23, 2021 | 7:28 PM

Farmers Tractor Rally: ఈనెల 26వ తేదీన రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రింగ్‌ రోడ్డు పరిధిలో ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చారు..

Farmers Tractor Rally: ఈనెల 26వ తేదీన రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
Follow us on

Farmers Tractor Rally: ఈనెల 26వ తేదీన రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రింగ్‌ రోడ్డు పరిధిలో ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చారు. కాగా, కేంద్ర తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల కారణంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు గత కొన్ని రోజులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందుకు కేంద్రం రైతులతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు.

అయితే ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ శాంతి భద్రతల పరిధిలోకి వస్తుందని, అందువల్ల దీనిపై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిని డీల్ చేసే అధికారం కేంద్రానికి కూడా ఉందని పేర్కొంది. నగరంలో ఎవరు ప్రవేశించాలి.. ఎవరిని అనుమతించాలన్న విషయాలు పోలీసులే నిర్ణయించాల్సి ఉంటుందని, తాము జోక్యం చేసుకోజాలమని సీజేఐ బాబ్డే అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ర్యాలీకి అనుమతి ఇచ్చారు.

రైతు చట్టాలపై పోరుకు అన్నాహజారే సిధ్ధం, ఈ నెల 30 నుంచి దీక్ష, కేంద్రానికి లేఖ, దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ