ఉగ్రదాడి ఎప్పుడైనా జరగొచ్చు.. ఢిల్లీలో హై అలర్ట్

| Edited By:

Oct 30, 2019 | 9:33 AM

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 48గంటల పాటు హైఅలర్ట్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదిన కేంద్రం.. జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ నెల 31వ తేదిన జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘావర్గాలు సమాచారం అందించడంతో.. కేంద్రం అప్రమత్తమైంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీని తమ హిట్ లిస్ట్‌లో పెట్టారని అందిన సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలతో […]

ఉగ్రదాడి ఎప్పుడైనా జరగొచ్చు.. ఢిల్లీలో హై అలర్ట్
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 48గంటల పాటు హైఅలర్ట్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదిన కేంద్రం.. జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ నెల 31వ తేదిన జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘావర్గాలు సమాచారం అందించడంతో.. కేంద్రం అప్రమత్తమైంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీని తమ హిట్ లిస్ట్‌లో పెట్టారని అందిన సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులకు కేంద్రం అప్రమత్తం చేసింది. ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలు, భవనాల వద్ద సాయుధ పోలీసులను మోహరించారు.

టీమిండియాపై ఉగ్ర కుట్ర
ఇదిలా ఉంటే మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సహా భారత క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేఖ అందింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే నవంబరు 3న భారత జట్టు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ ఆడనుండగా.. ఈ మ్యాచ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీస్ విభాగం నిర్ణయించింది. ఇక హిట్ లిస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఎల్‌కే అద్వానీ, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, గోవా గవర్నర్‌ సత్య పాల్‌ మాలిక్‌ తదితరుల పేర్లు ఉన్నాయి.