తానే డాక్టర్‌ని అంటూ ఫోజులిచ్చాడు.. పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు…

|

Nov 28, 2020 | 7:10 PM

ఆస్పత్రిలో అతనొక అటెండర్.. కానీ వైద్యం కోసం వచ్చే రోగుల ముందు తానే డాక్టర్ అన్నట్లుగా ఫోజులిస్తాడు. అంతేకాదు.. డాక్టర్‌లా విధులు కూడా నిర్వర్తిస్తాడు.

తానే డాక్టర్‌ని అంటూ ఫోజులిచ్చాడు.. పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు...
Follow us on

ఆస్పత్రిలో అతనొక అటెండర్.. కానీ వైద్యం కోసం వచ్చే రోగుల ముందు తానే డాక్టర్ అన్నట్లుగా ఫోజులిచ్చాడు. అంతేకాదు.. డాక్టర్‌లా విధులు కూడా నిర్వర్తించాడు. చివరికి విషయం తేలడంతో పోలీసులు అతడి భరతం పట్టారు. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు, అతన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిన వైద్యుడిపైనా చర్యలకు ఉపక్రమించారు. వివరాల్లోకెళితే.. ఢిల్లీలోని లోక్‌ నాయక్ ఆస్పత్రిలో ఓ వైద్యుడు తన విధులకు హాజరవకుండా అందులో పని చేసే అటెండర్‌ని తన సీట్లో కూర్చుని తనలా నటించాలంటూ ఒప్పించాడు. అందుకోసం సదరు అటెండర్‌కు డబ్బు కూడా చెల్లించాడు. ఈ ఒప్పందంలో భాగంగా అటెండర్.. వైద్యుల దుస్తులు ధరించి, మొహానికి మాస్క్ పెట్టుకుని డాక్టర్ సీట్‌లో కూర్చున్నాడు. రోగుల ముందు తానే వైద్యుడిగా నటించాడు. కానీ ఆస్పత్రిలోని ఇతర సిబ్బంది ఏదో తేడా జరుగుతోందని గ్రహించారు. మొహానికి పెట్టుకున్న మాస్క్ తీయాలని కోరగా తిరస్కరించాడు. దీంతో ఐడీ కార్డ్ చూపించాలని నిలదీయడంతో అసలు బండారం బట్టబయలైంది. మాస్క్ తీయగా.. ఆతను ఆస్పత్రిలో పనిచేసే అటెండర్ అని గుర్తించి అంతా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ నకిలీ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోగా, అటెండర్‌ను తనలా నటించమన్న వైద్యుడిపై చర్యలకు సిద్ధమయ్యారు.