ఇక ఇంటింటికీ రేషన్..సీఎం కీలక నిర్ణయం

|

Jul 21, 2020 | 7:16 PM

అర్హులకు రేషన్‌ సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ప్రత్యేక పథకాన్ని ప్రారంభించబోతోంది ఢిల్లీ సర్కార్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం రోజున మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకానికి ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ అని పేరు పెట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలను తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆవెూదించినట్లు తెలిపారు. మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ పథకాన్ని […]

ఇక ఇంటింటికీ రేషన్..సీఎం కీలక నిర్ణయం
Follow us on

అర్హులకు రేషన్‌ సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ప్రత్యేక పథకాన్ని ప్రారంభించబోతోంది ఢిల్లీ సర్కార్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం రోజున మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకానికి ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ అని పేరు పెట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలను తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆవెూదించినట్లు తెలిపారు.

మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ పథకాన్ని ఆవెూదించిందని సీఎం తెలిపారు. మంత్రులంతా ఈ పథకంపై హర్షం వ్యక్తం చేశారని అన్నారు. నిత్యావసర సరుకుల కోసం లబ్దిదారులు రేషన్‌ షాపుల వరకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను లబ్దిదారుల గడప వద్దకు పంపిణీ చేస్తామని తెలిపారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించబోతున్నామని కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు.