పాపం.. బట్టతలపై జుట్టు వస్తుందని ఆశపడ్డాడు.. కానీ, ఆఫర్‌లో వారు చేసిన పనికి ప్రాణాలే పోయాయి..

|

Dec 03, 2022 | 6:34 PM

బట్ట తల కారణంగా తనకు సరైన ఆత్మ విశ్వాసం ఉండేది కాదు. పెళ్లి కూడా కావడం లేదు. వచ్చిన సంబంధాలన్నీ ఆగిపోతున్నాయి. దీంతో ఎలాగైనా సరే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించాలనుకున్నాడు.

పాపం.. బట్టతలపై జుట్టు వస్తుందని ఆశపడ్డాడు.. కానీ, ఆఫర్‌లో వారు చేసిన పనికి ప్రాణాలే పోయాయి..
Hair Transplant
Follow us on

Hair Transplants: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కారణంగా ఢిల్లీలో ఒక యువకుడు చనిపోయాడు. మీడియా ఎగ్జిక్యుటివ్‌గా పని చేసే ముప్పై ఏళ్ల రషీద్.. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాడు. బట్ట తల కారణంగా తనకు సరైన ఆత్మ విశ్వాసం ఉండేది కాదు. పెళ్లి కూడా కావడం లేదు. వచ్చిన సంబంధాలన్నీ ఆగిపోతున్నాయి. దీంతో ఎలాగైనా సరే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించాలనుకున్నాడు. సర్జన్లను అడగ్గా.. ఈ ప్రక్రియకు మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో.. ఆఫర్ల కోసం ఎదురు చూశాడు.

ఇంతలో.. ఒక ఆఫర్ అతడ్ని వెతుక్కుంటూ వచ్చింది. సుమారు పదిహేను వేలకే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసే ఛాన్సు లభించడంతో.. సరేనన్నాడు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ తో ఒత్తయిన జట్టు లభిస్తుందని ఆశించిన అతడి ఆశ నిరాశే అయ్యింది. ట్రాన్స్ ప్లాంట్ ఫెయిల్ కావడంతో అతడు మరణించాడు. తన కొడుకు ప్రాణం తీసిన క్లినిక్ పై రషీద్ తల్లి ఆసియా బేగం (62) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల అవయవాలు పాడై పోయి రషీద్ చనిపోయాడంటూ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

మీడియా సమావేశంలో పాల్గొన్న మృతుడి తల్లి బేగం.. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల.. తన కొడుకు ఉబ్బిన ముఖానికి సంబంధించిన ఫోటోలను చూపారు. శరీరమంతా నల్లటి దద్దర్లు వచ్చినట్టుగా ఆ ఫొటోల్లో కనిపించింది. రషీద్ కు సర్జరీ చేసిన క్లినిక్‌ పై కంప్లయింట్ రావడంతో ఇద్దరు సర్జన్లతో పాటు మరో నలుగుర్ని పోలీసుల అరెస్టు చేశారు.

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిజానికి సెమీ మేజర్ సర్జరీ. ఇది సుమారు ఎనిమిది గంటల పాటు సాగుతుందని చెబుతారు నిపుణులు. ఈ కౌబాయ్ క్లినిక్ ల వల్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఇండస్ట్రీకి ఎంతో చెడ్డ పేరు వస్తోందని ఈ సంఘ సభ్యులు మండి పడుతున్నారు. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..