తుపాకీతో పాఠశాలకు వచ్చిన బాలుడు.. పరుగులు పెట్టిన విద్యార్థులు.. చివరకు ఏం జరిగిందంటే..

|

Aug 25, 2024 | 6:10 PM

ఢిల్లీలోని ఓ పాఠశాలకు విద్యార్థి తుపాకీతో రావడం కలకలం రేపింది.. విద్యార్థి స్కూల్ బ్యాగులో తుపాకీని చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.. నజఫ్‌గఢ్‌లోని ఓ పాఠశాలలో పదేళ్ల చిన్నారి బ్యాగ్‌లో పిస్టల్‌ దొరికినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

తుపాకీతో పాఠశాలకు వచ్చిన బాలుడు.. పరుగులు పెట్టిన విద్యార్థులు.. చివరకు ఏం జరిగిందంటే..
Gun In School Bag
Follow us on

ఢిల్లీలోని ఓ పాఠశాలకు విద్యార్థి తుపాకీతో రావడం కలకలం రేపింది.. విద్యార్థి స్కూల్ బ్యాగులో తుపాకీని చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.. నజఫ్‌గఢ్‌లోని ఓ పాఠశాలలో పదేళ్ల చిన్నారి బ్యాగ్‌లో పిస్టల్‌ దొరికినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శనివారం విద్యార్థి బ్యాగ్ లో తుపాకీని చూసిన విద్యార్థులు ఒక్కసారిగా భయపడ్డారు. ఈ విషయాన్ని వెంటనే పాఠశాల యాజమాన్యానికి చెప్పగా.. వారు దానిని స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబసభ్యులను విచారించారు.. పిస్టల్ చిన్నారి తండ్రికి చెందినదని, ఆయన కొన్ని నెలలక్రితం మరణించాడని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు లైసెన్సును రద్దు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

పిస్టల్‌ను ఆటబొమ్మగా భావించిన చిన్నారి.. దానితో ఆడుకునేందుకు పాఠశాలకు తీసుకొచ్చాడని.. పిస్టల్‌లో మ్యాగజైన్ లేదని పీటీఐ నివేదించింది..

పాఠశాల యాజమాన్యం బాలుడి తల్లిని ప్రశ్నించగా.. “పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేసేందుకు” ఆయుధాన్ని బయట ఉంచినట్లు చెప్పారు. పోలీసులు పిస్టల్ లైసెన్స్‌ను పరిశీలించగా.. అది చెల్లుబాటు అయ్యేదని నిర్ధారించారు. గుర్తించదగిన నేరం ఎలాంటిది జరగలేదని.. అదే రోజు తల్లి పోలీసు స్టోర్‌హౌస్‌లో జమ చేసిందని పోలీసులు తెలిపారు.

గతంలో ఎన్నో ఘటనలు..

ఇదిలాఉంటే.. ఈ నెల ప్రారంభంలో, ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలోని ఒక పాఠశాలలో సాధారణ తనిఖీలో 8వ తరగతి విద్యార్థి తన స్కూల్ బ్యాగ్‌లో పిస్టల్‌తో పట్టుబడ్డాడు. దీంతో విద్యార్థిని అదుపులోకి తీసుకోగా, అతని తండ్రి, మామలను అరెస్టు చేశారు. తన మేనమామ జార్ఖండ్‌ నుంచి తుపాకీని కొని అల్మారాలో ఉంచాడని, దానిని పాఠశాలకు తీసుకొచ్చాడని ఆ బాలుడు పోలీసులకు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

గత నెలలో, బీహార్‌లోని తన పాఠశాలకు ఐదేళ్ల బాలుడు తుపాకీని తీసుకెళ్లి మరో విద్యార్థిపై కాల్చి గాయపరిచాడు. ఉత్తర బీహార్‌లోని సుపాల్‌ జిల్లాలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సరీ విద్యార్థి తన స్కూల్ బ్యాగ్‌లో తుపాకీని దాచుకున్నాడు. పాఠశాలకు చేరుకోగానే ఉదయం 9 గంటల ప్రాంతంలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు.

మే నెలలో ఓ మైనర్ బాలిక తన సోదరుడు తుపాకీతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అయి బాలిక చనిపోయింది.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, బుల్లెట్ 16 ఏళ్ల బాలిక కడుపులో తగిలింది. ఇరుగుపొరుగు వారు బాలికను ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే నెలలో లక్నోలో 12వ తరగతి చదువుతున్న ఓ బాలుడు గదికి తలుపు వేసుకొని తుపాకితో కాల్చుకొని చనిపోతానని బెదిరించాడు. పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసి, అతడిని రక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..