Cyclone Shaheen: గులాబ్ దాటకముందే కొత్త గుబులు.. అరేబియా సముద్రంలో మరో తుఫాను.. పొంచి ఉన్న షహీన్ ముప్పు

|

Sep 29, 2021 | 8:59 PM

Cyclone Shaheen: గులాబ్ తుఫాను గుబులు మరవకముందే మరో ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది.

Cyclone Shaheen: గులాబ్ దాటకముందే కొత్త గుబులు.. అరేబియా సముద్రంలో మరో తుఫాను.. పొంచి ఉన్న షహీన్ ముప్పు
Cyclone
Follow us on

Cyclone Shaheen: గులాబ్ తుఫాను గుబులు మరవకముందే మరో ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం ఈ తుఫాను ఏర్పడే అవకాశముందన్నారు. బంగాళాఖాతంలో పుట్టిన గులాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటిన సంగతి తెలిసిందే.

గులాబ్ తుఫాను ముగిసినప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని వాయువులు ఇంకా మిగిలే ఉన్నాయి. గులాబ్ అవశేషాలు సెప్టెంబర్ 30 న అరేబియా సముద్రంలోకి ప్రవేశించి, ఒక రోజు తర్వాత తీవ్ర తుఫానుగా మారనున్నట్లు ఐఏండీ అధికారులు తెలిపారు. ఆపై పాకిస్తాన్ వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది. గులాబ్ తుఫాన్ వాయువులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ప్రయాణించి ప్రస్తుతం గుజరాత్ చేరాయని ఐఎండీ పరిశోధకులు తెలిపారు.


అల్పపీడన ప్రాంతం -గులాబ్ తుఫాను అవశేషాలు -దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఖంభట్‌లో బుధవారం ఉదయం ఏర్పడినట్లు IMD తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది, రేపు (సెప్టెంబర్ 30) నాటికి ఈశాన్య అరేబియా సముద్రంలోకి ఉద్భవించి అల్పపీడనంగా మారుతుంది. అప్పుడు అది మరింత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది. వీటి కారణంగా గుజరాత్‌పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. తరువాతి 24 గంటలలో అంటే అక్టోబర్ 1న తుఫానుగా మారే అవకాశముంది. ఇది భారతదేశం నుండి దూరంగా వెళుతుందని ఐఎండీ తెలిపింది. దీనికి ’సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది.

కాగా, ఈ తుఫాను భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా ఉత్తర కొంకణ్‌, గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో 24 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.

Read Also…  Home Loan: ఇల్లు కొనడం కోసం బ్యాంకు రుణాన్ని తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే, ఈ ఆరు విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి