Covid Vaccination Update: ఆ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు బ్రేకులు.. అసలు కారణమిదే.!

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 9:43 AM

Covid Vaccination Update: కరోనా వైరస్ మహమ్మారి అంతానికి తొలి అడుగు పడింది. శనివారం నాడు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను..

Covid Vaccination Update: ఆ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు బ్రేకులు.. అసలు కారణమిదే.!
Covid Vaccination
Follow us on

Covid Vaccination Update: కరోనా వైరస్ మహమ్మారి అంతానికి తొలి అడుగు పడింది. శనివారం నాడు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేసుకునే కోవిన్ అప్లికేషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల 17, 18 తేదీలలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా, దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. శనివారం టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టం చేసింది. 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది.