డిజిటలైజేషన్… కరోనా కారణంగా సాంకేతికత వినియోగం పెరిగింది… ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని…

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2020 | 3:25 PM

కరోనా కారణంగా సాంకేతిక వినిమోగం పెరిగిందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని అన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో డిజిటలైజేషన్ వాడాలంటే ఏళ్లు పట్టేవని, కానీ కరోనా కారణంగా అది వారాల్లోనే సాధ్యమైందని వివరించారు.

డిజిటలైజేషన్... కరోనా కారణంగా సాంకేతికత వినియోగం పెరిగింది... ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని...
Follow us on

కరోనా కారణంగా సాంకేతిక వినిమోగం పెరిగిందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని అన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో డిజిటలైజేషన్ వాడాలంటే ఏళ్లు పట్టేవని, కానీ కరోనా కారణంగా అది వారాల్లోనే సాధ్యమైందని వివరించారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… 2007లో ఐఫోన్ వినియోగంలోకి వచ్చిందని, అదే సమయంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ ప్రారంభమైందని అన్నారు.

నేడు స్మార్ట్‌ఫోన్లను చిన్న పిల్లలు సైతం వినియోగిస్తున్నారని నందన్ నిలేకని తెలిపారు. ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారని, వైద్య సదుపాయాన్ని పొందుతున్నారని వివరించారు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ రంగంలో సైతం నూతన ఆవిష్కరణలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఫలితంగా సాంకేతికత అందరికి అందుబాటులోకి వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ సైతం ప్రస్తుతం ఉన్న డిజిటల్ సేవలను విస్తృతపరిచేందుకు, ఉత్పత్తులు, సాంకేతికతను నేరుగా వినియోగదారున్ని చేరేలా ప్రయత్నించనున్నామని ఇన్ఫోసిస్ సీఈఓ సైలేష్ పరేఖ్ తెలిపారు.