Lockdown: భర్తలకు షాక్‌.. భార్యల్ని వేధించారో..!

| Edited By:

Apr 17, 2020 | 6:04 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల గృహ హింస అధికమౌతోంది. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్‌లో గృహ హింస ఎక్కువవుతోందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుణె అధికారులు వినూత్న చర్యలకు సిద్ధమయ్యారు. ఇళ్లలో భార్యలు, మహిళలను వేధించే పురుషులను క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ వేళ భర్తల చేతిలో భార్యలు గృహ హింసకు గురౌతున్నారన్న వార్తల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం […]

Lockdown: భర్తలకు షాక్‌.. భార్యల్ని వేధించారో..!
Follow us on

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల గృహ హింస అధికమౌతోంది. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్‌లో గృహ హింస ఎక్కువవుతోందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుణె అధికారులు వినూత్న చర్యలకు సిద్ధమయ్యారు. ఇళ్లలో భార్యలు, మహిళలను వేధించే పురుషులను క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ వేళ భర్తల చేతిలో భార్యలు గృహ హింసకు గురౌతున్నారన్న వార్తల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పుణె జిల్లాపరిషత్‌ సీఈవో ఆయుష్ ప్రసాద్ తెలిపారు. మద్యం షాపుల మూసివేతతో దిక్కుతోచకనే పురుషులు ఈ చర్యలకు తెగబడుతున్నారని ఆయన వెల్లడించారు.

మొదట కౌన్సిలర్లు, పోలీసుల సాయంతో నచ్చచెబుతామని.. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే క్వారంటైన్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం పంచాయితీ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి.. ఇంటింటికి వెళ్లి వివరాలు కనుక్కుంటామని ప్రసాద్ వివరించారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ హీరో పెళ్లి.. సర్వత్రా విమర్శలు..!