షాకింగ్.. ఆకలితో అలమటిస్తోన్న 82కోట్ల మంది..!

| Edited By:

May 12, 2020 | 8:08 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేయడం కోసం చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక నష్టాన్ని పక్కనపెట్టి..

షాకింగ్.. ఆకలితో అలమటిస్తోన్న 82కోట్ల మంది..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేయడం కోసం చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక నష్టాన్ని పక్కనపెట్టి.. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే లాక్‌డౌన్‌ వలన చాలా మంది ఆకలి దప్పులతో అలమటిస్తోన్న వేళ 2020 గ్లోబల్ న్యూట్రిషన్‌ రిపోర్ట్ షాకింగ్ రిపోర్ట్‌ను బయటపెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేవని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ప్రాంతం, సంపద, విద్య, విద్యాస్థాయి, వయస్సు, లింగ వివక్ష పేరిట ప్రపంచ ప్రజల్లో సామాజిక అసమానతలు కొనసాగడం వలన పోషక విలువలు హరించుకుపోతున్నాయని.. దానికి తోడు వ్యవసాయ సాగులో వచ్చిన మార్పులు కూడా ఒక కారణమని ఆ రిపోర్ట్ పేర్కొంది. ప్రతి 9 మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 82కోట్లు ఉందని ఆ రిపోర్ట్ పేర్కొంది. అంతేకాదు పోషకాహార లోపం వలన స్థూలకాయం, ఎక్కువ బరువుతో బాధపడుతున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

Read This Story Also: దారుణం.. మెటర్నిటీ ఆసుపత్రిపై దాడి.. చిన్నారులు మృతి