Lakhimpur Kheri Violence: ఆ ముగ్గురికి మాత్రమే అనుమతి.. లఖీంపూర్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంక..

|

Oct 06, 2021 | 1:55 PM

తీవ్ర ఉద్రిక్తత మధ్య రాహుల్‌, ప్రియాంకాగాంధీ లఖీంపూర్‌ పర్యటనకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో చేరుకున్నారు రాహుల్‌.

Lakhimpur Kheri Violence: ఆ ముగ్గురికి మాత్రమే అనుమతి.. లఖీంపూర్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంక..
Rahul Gandhi And Priyanka G
Follow us on

తీవ్ర ఉద్రిక్తత మధ్య రాహుల్‌, ప్రియాంకాగాంధీ లఖీంపూర్‌ పర్యటనకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో చేరుకున్నారు రాహుల్‌. రాహుల్‌తో పాటు విమానంలో చత్తీస్‌ఘడ్‌ సీఎం బగేల్‌, పంజాబ్‌ సీఎం చన్నీ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల కుటుంబాలను పరామర్శిస్తానని అంటున్నారు రాహుల్‌. చివరిక్షణంలో రాహుల్‌గాంధీ లఖీంపూర్‌ పర్యటనకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాహుల్‌తో పాటు ముగ్గురు లఖీంపూర్‌ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రాహుల్‌తో ప్రియాంకాగాంధీ కూడా లఖీంపూర్‌కు వెళ్లేందుకు ఉత్తరప్రదేశ్‌ హోంశాఖ అనుమతిచ్చింది.

లఖింపూర్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని .. అక్కడికి ఎవరిని అనుమతించడం లేదని అంతకుముందు యూపీ పోలీసులు తెలిపారు. అయితే తనతో పాటు చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌ , పంజాబ్‌ సీఎం చన్నీ మాత్రమే వస్తున్నారని , తమకు 144 సెక్షన్‌ వర్తించదని రాహుల్‌ తెలిపారు. చివరిక్షణంలో రాహుల్‌తో పాటు ప్రియాంకకు కూడా అనుమతి ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది.

లక్నో ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డు మార్గంలో లఖింపూర్‌ చేరుకుంటున్నారు రాహుల్‌. అయితే రాహుల్‌ పర్యటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 1984లో సిక్కులను ఊచకోత కోసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని విమర్శించారు. లఖీంపూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం కొనసాగుతుందోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడి కాన్వాయ్‌ దూసుకెళ్లి నలుగురు రైతులు చనిపోయినట్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. కేంద్రమంత్రి కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టిచంపినట్టు ఆరోపణలు వచ్చాయి. కారు తనదే అని , కాని తన కుమారుడు డ్రైవింగ్‌ చేయలేదంటున్నారు కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా. ఈ ఘటన జరిగినప్పుడు తాము లఖీంపూర్‌లో లేమని ఆయన చెబుతున్నారు. ఢిల్లీ చేరుకున్న అజయ్‌మిశ్రా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అజయ్‌ మిశ్రా రాజీనామా చేస్తారా ? లేదా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అయితే కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను బీజేపీ హైకమాండ్‌ వెనకేసుకొస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో నియంత పాలన నడుస్తోందని , లఖీంపూర్‌కు విపక్ష నేతలు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. మరోవైపు లఖీంపూర్‌ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు మోదీ. శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Badvel By Election: బద్వేల్‌ బరిలో బీజేపీ లిస్ట్‌.. ఆ ఐదుగురి పేర్లపై అధిష్టానం ఫోకస్..

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. దసరా ముందు ఇదేం బాదుడు..