చిద్దూకు ఊరట.. జైలు నుంచి బయటకు మాజీ కేంద్ర మంత్రి

| Edited By: Pardhasaradhi Peri

Dec 04, 2019 | 10:02 PM

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన చిద్దూకు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే చిదంబరంకు బెయిల్ వచ్చిన సందర్భంలో గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇప్పటికే జాతీయ […]

చిద్దూకు ఊరట.. జైలు నుంచి బయటకు మాజీ కేంద్ర మంత్రి
Follow us on

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన చిద్దూకు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే చిదంబరంకు బెయిల్ వచ్చిన సందర్భంలో గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇప్పటికే జాతీయ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆగష్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఆ తరువాత అక్టోబర్ 16న ఈడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి తీహార్ జైల్‌లో చిద్దూ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. సీబీఐ కేసులో అక్టోబర్ 21నే చిదంబరానికి బెయిల్ లభించినప్పటికీ.. ఈడీ అదుపులో ఉండటంతో జైలు నుంచి బయటకు రాలేకపోయారు. ఇక తాజాగా ఈడీ కేసులోనూ సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో చిదంబరం విడుదల కానున్నారు. కాగా దాదాపు 106రోజుల పాటు చిద్దు తీహార్ జైలులో గడిపారు.