Sonia Gandhi: మూడు గంటలు.. ముప్పై ప్రశ్నలు.. మళ్లీ కొనసాగుతున్నఈడీ విచారణ

|

Jul 26, 2022 | 4:14 PM

National Herald Case: మూడుగంటలపాటు సోనియాపై ఈడీ ప్రశ్నల పరంపర సాగింది. ఈ విచారణకు సోనియా గాంధీతో పాటు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా వెంట వెళ్లారు.

Sonia Gandhi: మూడు గంటలు.. ముప్పై ప్రశ్నలు.. మళ్లీ కొనసాగుతున్నఈడీ విచారణ
Sonia Gandhi
Follow us on

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తొలి దఫా ఈడీ విచారణ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం (జూలై 26) మూడు గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణకు సోనియా గాంధీతో పాటు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా వెంట వెళ్లారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్ని ఆరోపణలపై సోనియాను ఇప్పటికే ఓ సారి విచారించిన ఈడీ.. రెండోసారి విచారించింది. సోనియా ఈడీ విచారణపై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. మోదీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు గల్లీ నుంచి ఢిల్లీదాకా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో సోనియా విచారణకు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారులపైకి భారీగా చేరుకున్న కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.

పోలీసుల తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్‌ శ్రేణులు. ప్రశాంతంగా సాగిస్తున్న నిరసనను అడ్డుకోవడంపై మండిపడ్డారు. కేంద్రానికి నిరసనగా నల్లబెలూన్లను ఎగురవేసి నిరసన వెల్లడించారు. సోనియాపై కక్షసాధింపు చర్యలను ఆపేదాకా నిరసన కొనసాగిస్తామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు కేవీపీ, శ్రీధర్‌బాబు.

సాయంత్రం వరకు ఈడీ ప్రశ్నించే అవకాశం..

ఇదిలావుంటే.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఇవాళ సాయంత్రం వరకు ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. సోనియా గాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈడీ ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో ప్రియాంక గాంధీ మందులతో హాజరవుతారని చెబుతున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈడీ దాదాపు మూడు డజన్ల ప్రశ్నలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ కేసుకు సంబంధించి సోనియాను ఈడీ సూటిగా ప్రశ్నలు అడుగుతుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. సోనియా గాంధీ ఆరోగ్యం దృష్ట్యా ఈడీ ప్రధాన కార్యాలయం చాలా అప్రమత్తంగా ఉందని.. అధికారులు మాస్క్‌లు ధరించి ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..