వినియోగదారులకు భారీ షాక్.. ధరలు పెంచే ఆలోచనలో మొబైల్ కంపెనీలు..  అసలు కారణం ఇదేనా?

|

Dec 08, 2020 | 12:29 PM

స్మార్ట్ ఫోన్‏ ధరలను పెంచే ఆలోచనల్లో టాప్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. చిప్‌సెట్లకు తీవ్ర కొరత ఉండడంతో కంపెనీలు ఈ ఆలోచన చేస్తున్నాయి.

వినియోగదారులకు భారీ షాక్.. ధరలు పెంచే ఆలోచనలో మొబైల్ కంపెనీలు..  అసలు కారణం ఇదేనా?
Follow us on

స్మార్ట్ ఫోన్‏ ధరలను పెంచే ఆలోచనల్లో టాప్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. చిప్‌సెట్లకు తీవ్ర కొరత ఉండడంతో కంపెనీలు ఈ ఆలోచన చేస్తున్నాయి. పరిశ్రమ ఇప్పటికే విడిభాగాల కొరతను ఎదుర్కొంటూ, పన్నుల పెంపు, కరోనా సంక్షోభంతో కొన్ని నెలల పాటు అమ్మకాల్లేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు చిప్‌సెట్లు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే మొబైల్ కంపెనీలు ధరలను పెంచింతే 2020లో నాలుగో విడత పెంపు అవుతుంది.

ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెంచొచ్చని తయారీదారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం నెలకొనడంతో ఉత్పత్తులకు ధరల  మధ్య కంపెనీలకు సమస్య ఏర్పడింది. చైనాకు చెందిన హువావే నుంచి అతిపెద్ద కాంట్రాక్ట్ రావడంతో చిప్‌సెట్ల డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

చిప్‌సెట్లకు హువావే సంస్థ భారీగా ఆర్డర్ ఇచ్చింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చిప్‌సెట్లకు కొరత చాలా తీవ్రమైంది అని ఓ ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మరో మొబైల్ ఫోన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ దీనికి స్పందిస్తూ.. హువావే భారీ ఆర్డర్ మద్య స్థాయి కంపెనీలకు చిప్‌సెట్ల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ కంపెనీలకు సరఫరాదారులతో స్వల్పాల కాంట్రాక్టులే ఉన్నాయి అని పేర్కోన్నారు. చిప్‌సెట్ల సరఫరా ఇప్పుడూ మరీ తగ్గిపోయిందంటూ తమ అవసరాల్లో మూడు శాతం వరకే సమకూర్చుకోగలిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్పాట్ మార్కెట్ నుంచి చిప్‌సెట్లను కొనుగోలు చేయాల్సి  వస్తోందని, దీంతో అక్కడ ధరలు చాలా పెరిగినట్లు తెలిపారు. స్పాట్ మార్కెట్లో చిప్‌సెట్ల ధరలు 25-27 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ అంటోంది. దీంతో మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ వ్యయం 8-20 శాతం పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు సర్ధుబాటు చేసుకునేందుకు గాను 10 శాతం వరకు ఫోన్ల ధరలను పెంచాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.