జమ్మూ కాశ్మీర్ లోని పలు గ్రామాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు. నలుగురి మృతి. 40 మందికి పైగా గల్లంతు

| Edited By: Anil kumar poka

Jul 28, 2021 | 10:06 AM

జమ్మూ కాశ్మీర్ లోని కిష్టవర్ తో బాటు సమీప గ్రామాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా నలుగురు మరణించగా 40 మందికి పైగా గల్లంతయ్యారు. అనేక ఇళ్ళు కూలిపోయాయి. కిష్టవర్, హొంజర్ గ్రామంతో బాటు...

జమ్మూ కాశ్మీర్ లోని పలు గ్రామాల్లో  భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు. నలుగురి మృతి. 40 మందికి పైగా గల్లంతు
Cloud Burst In Jammu And Kashmir S Kishtavar
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని కిష్టవర్ తో బాటు సమీప గ్రామాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా నలుగురు మరణించగా 40 మందికి పైగా గల్లంతయ్యారు. అనేక ఇళ్ళు కూలిపోయాయి. కిష్టవర్, హొంజర్ గ్రామంతో బాటు ‘దాచన్’ తహశీల్ లోని పలు గ్రామాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. గత కొన్ని రోజులుగా జమ్మూ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నిరాశయులైన వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పలు గ్రామాలకు జమ్మూతో రోడ్డు సంబంధాలు తెగిపోయాయని కిష్టవర్ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ శర్మ తెలిపారు. ఆర్మీ, పోలీసు బృందాలుశిథిలాలను తొలగించి బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను ఈ బృందాలు వెలికి తీశాయన్నారు. ముంపు ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించామన్నారు.

సమీప ప్రాంత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, పబ్లిక్ నల్లాల లోని నీరు కలుషితం కావచ్చునని.. అందువల్ల నీటిని కాచి తాగాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. సహాయక బృందాలకు సహకరించవలసినదిగా భారత వైమానిక దళాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కోరారు. ఈ నెలాఖరు వరకు కూడా వర్షాలు ఈ ప్రాంతాలను ముంచెత్తవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొండ చరియలు విరిగి పడుతుండగా బండరాళ్లు కొట్టుకు వస్తుండడంతో రహదారులన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా బాధిత ప్రాంతాలకు సహాయక బృందాలు త్వరిత గతిన చేరుకోలేకపోతున్నాయి. కేంద్రం నుంచి మరిన్ని రెస్క్యూ టీమ్స్ రానున్నాయని అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : కన్నడిగులకు కొత్త సీఎం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 పోలీసోడి బైకుకే పాము ఎసరు !చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేసిన పోలీస్..ఎం జరిగిందో తెలుసా..?:Snake in police bike Video.

 బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.

 వెంకటేష్ గారు ఫస్ట్ చదువుకోమన్నారు..! సిన్నప్ప ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ…:Narappa Movie Rakhi interview Video.