చైనా మరో కుట్ర.. భారత ఆస్తులే టార్గెట్ చేసేందుకు ఉగ్ర సంస్థలకు సాయం..

| Edited By:

Jul 20, 2020 | 8:09 AM

డ్రాగన్‌ కంట్రీ కన్నింగ్‌ తెలివి మరోసారి బయటపడింది. గత నెలలో గాల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న సంఘటన తర్వాత.. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కయ్యానికి కాలుదువ్వుతున్న..

చైనా మరో కుట్ర.. భారత ఆస్తులే టార్గెట్ చేసేందుకు ఉగ్ర సంస్థలకు సాయం..
Follow us on

డ్రాగన్‌ కంట్రీ కన్నింగ్‌ తెలివి మరోసారి బయటపడింది. గత నెలలో గాల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న సంఘటన తర్వాత.. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనాకు పెద్ద ఎత్తున ఆర్ధిక నష్టాలు ప్రారంభమయ్యాయి. అటు భారత్‌ బాటలోనే ఇతర దేశాలు కూడా అడుగులు వేస్తుండటంతో.. చైనా భారత్‌పై గుర్రుగా ఉంది. ఇక భారత ఆస్తులే లక్ష్యంగా పరోక్ష దాడులకు దిగేందుకు కుట్రలు చేస్తోంది. ఇటీవల మయన్మార్‌- థాయిలాండ్‌ బార్డర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు మయన్మార్, థాయిలాండ్ పోలీసులు. గత నెలలో మయన్మార్-థాయిలాండ్ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున చైనాకు చెందిన ఏకే-47 అసాల్ట్ రైఫిల్స్‌, యాంటీ ట్యాంక్ మైన్స్‌, గ్రేనేడ్స్‌, మెషిన్ గ‌న్స్‌తో పాటు..పలు ఆయుధాలను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి.

ఆయుధాలను బంగ్లాదేశ్‌ పక్కనే ఉన్న రాఖైన్ రాష్ట్రంలో పనిచేస్తున్న అరకాన్‌ ఆర్మీకి అందించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే వీరు చెప్పినట్లు అరకాన్ సైన్యం ఇలాంటి ఆయుధాలను వాడటం లేదని తేలింది. అంతేకాకుండా.. స్వాధీనం చేసుకున్న ఆయుధాలన్నీ చైనాకు చెందినవే. అయితే ఈ ఆయుధాలను మయన్మార్, బంగ్లాదేశ్‌లో ఉన్న చిన్న చిన్న ఉగ్ర సంస్థలకు అందజేసి.. వారితో భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. విషయాన్ని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి.