వరదల ఎఫెక్ట్‌.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుక్మా జిల్లా వాసులు

| Edited By:

Aug 22, 2020 | 12:26 AM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. స్థానిక ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సుక్మా జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో..

వరదల ఎఫెక్ట్‌.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుక్మా జిల్లా వాసులు
Follow us on

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. స్థానిక ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సుక్మా జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు.. వరదల దాటికి బయటికి రాలేకపోతున్నారు. భారీ వర్షాలకు నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో.. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దారులు మూసుకున్నాయి. దీంతో అధికారులు వారికి ఇబ్బందులు తలెత్తుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వరదల ప్రభావంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం